logo

మల్లెపూల నుంచి ఆయిల్‌ ఉత్పత్తి

Published : 03 Jul 2024 06:27 IST

ఆ విధానాలపై దృష్టి పెట్టండి
మంత్రి లోకేశ్‌ ఆదేశం

   మంగళగిరి నియోజకవర్గ పరిధిలో మల్లెపూల తోటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ పూల నుంచి ఆయిల్‌ ఉత్పత్తి విధానాలపై దృష్టి పెట్టండి. మాగాణి భూముల్లో కేవలం వరినే పండిస్తున్నారు. ఈ స్థానంలో వేరే ఇతర పంటలను పండించవచ్చేమో పరిశీలించి రైతులను ప్రోత్సహించాలి. నియోజకవర్గ పరిధిలో కౌలు రైతులు ఎంత విస్తీర్ణంలో భూములను సాగు చేస్తున్నారో ఆ వివరాలను సేకరించి తెలపండి. గుంటూరు ఛానల్‌ పరిధిలోని పెండింగ్‌లో ఉన్న పనులపైనా జలవనరులశాఖ అధికారులు దృష్టి పెట్టాలి. 

మంత్రి నారా లోకేశ్‌

వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశమైన లోకేశ్‌.. నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. భవిష్యత్తు ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. రైతులు వ్యవసాయ యంత్ర పరికరాలను కోరుతున్న విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పెదవడ్లపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే అంశంపై మంత్రి అధికారులతో సమీక్షించి, అవసరమైన సూచనలు చేశారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్‌. వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ అధికారి రవీంద్ర, అనుబంధల శాఖల అధికారులు పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, కలెక్టరేట్‌ (గుంటూరు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని