logo

అర్జీ ఒకటైతే.. రసీదులో మరోలా నమోదు

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీల నమోదులో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నప్పుడు ఆ సమస్యను పూర్తిగా చదవకుండానే రసీదుపై ఏదో ఒకటి రాసిచ్చేస్తున్నారు.

Published : 03 Jul 2024 04:34 IST

గోపాల్‌రెడ్డికిచ్చిన రసీదులో తప్పుగా నమోదు చేశారిలా..

కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీల నమోదులో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నప్పుడు ఆ సమస్యను పూర్తిగా చదవకుండానే రసీదుపై ఏదో ఒకటి రాసిచ్చేస్తున్నారు. అప్పాపురం బ్రాంచ్‌ కాలువల్లో పూడిక తీయాలంటూ గతంలో కాకుమాను మండలం చినలింగాయపాలెం రైతు హనుమంతరావు కోరగా.. 2025 జూన్‌లో పరిష్కరిస్తామని సిబ్బంది రసీదులో నమోదు చేశారు. ఇది చూసి ఖంగుతిన్న ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా గుంటూరు మార్కెట్‌యార్డులో ఆరుగురు వేమెన్లను సస్పెండ్‌ చేసి, లైసెన్సులను రద్దు చేసినా వారు యథావిధిగా విధులకు హాజరవుతున్నారంటూ గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా.. ఆయనకిచ్చిన రసీదులో కమీషన్‌ ఏజెంట్‌కు ఎక్కువ కమీషన్‌ ఇస్తున్నారంటూ రాశారు. అంతేకాదు.. ఆయనిచ్చిన ప్రస్తుత చిరునామాను కాకుండా ఆధార్‌లో ఉన్న వివరాలను నమోదు చేశారు. ఇలా తరచూ జరుగుతోంది. మొక్కుబడిగా నమోదు చేస్తున్నారని, ఈ విధానాన్ని సరిదిద్దాలని అర్జీదారులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు