logo

నిబంధనల మేరకే ఉపాధ్యాయుల బదిలీలు: మంత్రి లోకేశ్‌

విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఉండవల్లి నివాసంలో మంగళవారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్‌’కు రాష్ట్రం నలుమూలల నుంచి వినతులు వెల్లువెత్తాయి.

Published : 03 Jul 2024 04:11 IST

 వృద్ధురాలి సమస్య వింటున్న లోకేశ్‌

తాడేపల్లి, న్యూస్‌టుడే: విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఉండవల్లి నివాసంలో మంగళవారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్‌’కు రాష్ట్రం నలుమూలల నుంచి వినతులు వెల్లువెత్తాయి. వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్లపాటు సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడ్డ సామాన్యులకు లోకేశ్‌ భరోసా ఇచ్చారు. ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు పొంది ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచిపోయిన ప్రక్రియ అమలుకు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు విన్నవించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు బదిలీల్లో భారీ అవినీతి జరిగిందన్నారు. నిబంధనలు మేరకు బదిలీల ప్రక్రియ చేపడతామన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడి వైద్యానికి చేయూత ఇవ్వాలని, ఆగిపోయిన పింఛన్లను పునరుద్ధరించాలని పలువురు వినతులు అందించారు. ఆయా సమస్యలను సంబంధిత విభాగాలకు పంపించాలని మంత్రి సిబ్బందిని ఆదేశించారు.


ఉండవల్లి నివాసం వద్ద ప్రజాదర్బార్‌కు హాజరయ్యేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని