logo

అడుగడుగునా ఆప్యాయంగా పలకరిస్తూ..

బాణావత్‌ పాములు కుటుంబానికి పింఛను పంపిణీ తర్వాత గ్రామంలోని కూడలిలో అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదికకు కాలినడకన చంద్రబాబు బయలుదేరారు.

Published : 02 Jul 2024 04:29 IST

తనకు ఇల్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబును వేడుకుంటున్న నరసమ్మ

ఈనాడు, అమరావతి, తాడేపల్లి, న్యూస్‌టుడే: బాణావత్‌ పాములు కుటుంబానికి పింఛను పంపిణీ తర్వాత గ్రామంలోని కూడలిలో అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదికకు కాలినడకన చంద్రబాబు బయలుదేరారు. ఈ క్రమంలో స్థానికులు చంద్రబాబును కలిసి వారి సమస్యలు విన్నవించారు. ఓ మహిళ తన కుమారులను చూపి వారికి ఆర్థిక సహాయం చేయాలని వేడుకున్నారు.

  • అదే మార్గంలో నరసమ్మ అనే వృద్ధురాలు రోజువారీ కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనకు సొంత ఇల్లు లేదని, మంజూరు చేయాలని కోరారు. కూలి డబ్బులు జీవనానికే సరిపోతున్నందున, ఇంటికి సాయం చేయాలని వేడుకుంది. భుజం తట్టి సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.
  • ఓ వృద్ధురాలు తనకు పింఛను ఇప్పించమని కోరింది. వీధిలో అందరినీ పలకరిస్తూ వెళ్తున్న సీఎంను చూసి గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజావేదిక వద్దకు బాబు చేరుకోగానే జైబాబు జైజై బాబు అంటూ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు.
  • ముఖ్యమంత్రి చంద్రబాబును వేదికపైకి తెదేపా మండల అధ్యక్షుడు అమరా సుబ్బారావు ఆహ్వానించారు.  6.52గంటలకు వేదికపైకి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రసంగించడంతో పాటు వేదిక ఎదుట కూర్చున్నవారిని మాట్లాడించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. కొందరు మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
  • గ్రామంలో టిడ్కో ఇళ్ల సముదాయంలో తాగు నీటి సమస్య పరిష్కరించాలని మహిళ ఒకరు కోరారు. తండాలో కొండ పొరంబోకు స్థలంలో ఇల్లు కట్టుకున్నవారికి పట్టాలు ఇవ్వాలని కోరారు. శ్మశానం, కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు నిర్మించాలని నాగారాజు నాయక్‌ కోరారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని