logo

మంగళగిరి ప్రజల రుణం తీర్చుకోవాలి

మంత్రి లోకేశ్‌ మంగళగిరి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబును కోరారు.

Published : 02 Jul 2024 04:26 IST

పెనుమాకలో ఇంటింటికీ వెళ్లి గ్రామస్థులను పలకరిస్తున్న సీఎం

ఈనాడు, అమరావతి, తాడేపల్లి, న్యూస్‌టుడే: మంత్రి లోకేశ్‌ మంగళగిరి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబును కోరారు. సీడ్‌యాక్సెస్‌ రహదారి నిర్మాణానికి, అమరావతి అభివృద్ధిలో మంగళగిరి ప్రజలు భాగస్వామ్యులు అవుతారన్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించిన మంగళగిరి ప్రజల రుణం తీర్చుకోవడానికి బాగా పనిచేయాలని, సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆర్థికంగా ముడిపడని సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

  • సభ అనంతరం స్థానికులు, నాయకులు చంద్రబాబును పరిచయం చేసుకున్నారు. సమావేశం ముగించుకుని ఉదయం 8.37 గంటలకు చంద్రబాబు తిరిగి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావేదిక నుంచి తిరిగి వెళ్తుండగా తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు కళ్లం రాజశేఖరరెడ్డి గజమాలతో సత్కరించారు. బాబు కారు పొడవైన గజమాల వద్దకు చేరుకోగానే క్రేన్‌తో సహాయంతో వేశారు.
  • సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఒకే వేదికను పంచుకోవడం, లోకేశ్‌ సమస్యలు ప్రస్తావించడం, చంద్రబాబు బాగా పనిచేయాలని సూచించడం, అందరిలోనూ మెరిట్‌ చూస్తానని, కుటుంబ సభ్యుడైనా ప్రతిభకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పడంతో సభలో నవ్వులు  విరిశాయి. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు, తెదేపా నియోజకవర్గ పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన చేనేత వికాస విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావు, గ్రామ మాజీ సర్పంచి కళ్లం అనంతశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని