logo

పింఛన్ల పంపిణీలో చేతివాటం

ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో మాచర్లలోని 9వ వార్డు సచివాలయ వెల్ఫేర్‌ సెక్రటరీ బాణావత్‌ బాలూనాయక్‌ చేతివాటం ప్రదర్శించాడు.

Published : 02 Jul 2024 04:20 IST

సచివాలయ ఉద్యోగి సస్పెన్షన్‌

లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరిస్తున్న కమిషనర్‌ వెంకటదాసు

మాచర్ల(కారంపూడి), న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో మాచర్లలోని 9వ వార్డు సచివాలయ వెల్ఫేర్‌ సెక్రటరీ బాణావత్‌ బాలూనాయక్‌ చేతివాటం ప్రదర్శించాడు. సోమవారం పట్టణంలోని 28 మంది లబ్ధిదారులకు రూ.7 వేలు చొప్పున పింఛన్‌ పంపిణీ చేసి, ఒక్కొక్కరితో రూ.500 వసూలు చేశాడు. మరో మైనార్టీ మహిళ వద్ద వేలిముద్రలు తీసుకుని  నగదు ఇవ్వకుండా వెళ్లిపోయాడు. దీనిపై స్థానికులు తెదేపా నాయకులకు సమాచారం ఇవ్వగా.. వారు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే మున్సిపల్‌ కమిషనర్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటదాసు, పట్టణ తెదేపా అధ్యక్షుడు కొమెర దుర్గారావు లబ్ధిదారులతో మాట్లాడారు. పింఛనుదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇప్పించారు. కమిషనర్‌ విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్‌ వెల్ఫేర్‌ సెక్రటరీని సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పింఛన్ల పంపిణీ సక్రమంగా జరగాలని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదని కలెక్టరు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని