logo

దారి మారాలి.. దశ తిరగాలి..

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్‌ ఆసుపత్రికి రోగులు చేరుకోవడానికి గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో సరైన రహదారి నిర్మించలేకపోయింది.

Published : 02 Jul 2024 04:14 IST

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్‌ ఆసుపత్రికి రోగులు చేరుకోవడానికి గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో సరైన రహదారి నిర్మించలేకపోయింది. ఈ ఆసుపత్రికి మంగళగిరి టౌన్‌లోని పాత జాతీయ రహదారి నుంచి ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్దకు చేరుకోవడానికి డబుల్‌లైన్‌ రహదారి నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేసినా కేవలం సింగిల్‌లైన్‌ మాత్రమే వేసి వదిలేశారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఎయిమ్స్‌ ప్రధానద్వారం వద్ద రహదారి అంతా ఛిద్రమైంది. ఒకే వరుస మార్గం కావడంతో ఎదురుగా వాహనం వస్తే పక్కకు తప్పుకోవడానికీ చోటు లేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో రెండు వరుసల రోడ్డు వేయాలని వాహనదారులు కోరుతున్నారు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని