logo

పల్లెకోనలో బీపీటీ కొత్తరకం విత్తనాల పంపిణీ

మండలంలోని పల్లెకోన గ్రామంలో ముగ్గురు రైతులకు బీపీటీ-2858 విత్తనాలకు సంబంధించిన రెండు కిలోలను ఏరువాక కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు డాక్టరు ఆô్.బాలమురళీధô్నాయÚ్, డాక్టరు జె.రాధాకృష్ణ సోమవారం పంపిణీ చేశారు.

Published : 02 Jul 2024 04:10 IST

విత్తనాలు అందిస్తున్న శాస్త్రవేత్తలు

భట్టిప్రోలు, న్యూస్‌టుడే : మండలంలోని పల్లెకోన గ్రామంలో ముగ్గురు రైతులకు బీపీటీ-2858 విత్తనాలకు సంబంధించిన రెండు కిలోలను ఏరువాక కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు డాక్టరు ఆô్.బాలమురళీధô్నాయÚ్, డాక్టరు జె.రాధాకృష్ణ సోమవారం పంపిణీ చేశారు. ఈ విత్తనాలను నారుమడి సమయంలో 8 సెంట్లలో చల్లాలని సూచించారు. కొత్తరకం విత్తనాలు కావడంతో కొన్ని ప్రాంతాల్లో ఈ విత్తనాలను అందించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పైరు ఎదుగుదల, దిగుబడులను పరిశీలించిన తర్వాత మార్కెట్లోకి విత్తనాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి జి.మీరయ్య, పల్లెకోన రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని