logo

ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలు

ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ద.మ.రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌ సూచించారు.

Published : 02 Jul 2024 04:09 IST

మాట్లాడుతున్న అరుణ్‌ కుమార్‌ జైన్, పక్కన రామకృష్ణ, సైమన్‌ తదితరులు

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ద.మ.రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌ సూచించారు. గుంటూరులోని రైల్‌ వికాస్‌ భవన్‌లో సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అరుణ్‌ కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ అంతర్గత వనరుల్ని గరిష్ఠంగా సద్వినియోగం చేసుకొంటూ సరకు రవాణాలో వాటా పెంపొందించుకోవాలని కోరారు. నిర్వహణ నిష్పత్తి మరింత దిగివచ్చేలా చూడడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. ప్రయాణ భద్రత, పట్టాల మార్పిడి, వంతెనల నిర్మాణాలు, మరమ్మతులు తదితరాలపై రూపొందించిన క్యాలెండర్‌ను పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఎం రామకృష్ణ, ఏడీఆర్‌ఎం సైమన్, సీనియర్‌ డీఈఎన్‌(కోఆర్డినేషన్‌) అనూష, సీనియర్‌ డీవోఎం దినేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని