logo

సస్పెండ్‌ చేసినా విధుల్లోనే వేమెన్లు

‘ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు మార్కెట్‌ యార్డులోని ట్రేడ్‌ యూనియన్‌ కార్యాలయంలో అప్పటి వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.

Published : 02 Jul 2024 04:07 IST

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు

కలెక్టరేట్‌కు వచ్చిన వేమెన్‌ గోపాలరెడ్డి

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ‘ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు మార్కెట్‌ యార్డులోని ట్రేడ్‌ యూనియన్‌ కార్యాలయంలో అప్పటి వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. దీంతో మార్చి నెలాఖరున ఆరుగురు వేమెన్లను అధికారులు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయినా నేటికీ వారు విధుల్లోనే కొనసాగుతున్నారు’.. అని వేమెన్‌ టి.గోపాలరెడ్డి పేర్కొన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం ఆనిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో యన ఈమేరకు ఫిర్యాదు చేశారు. వేమెన్‌ లైసెన్సులు సస్పెండ్‌ చేసినా.. వారు యథావిధిగానే కొనసాగుతున్నా యార్డులోని అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కాటాలకు సంబంధించి పుస్తకాల్లో నమోదు ప్రక్రియలను సైతం వారు నిర్వథహిస్తున్నారన్నారు. సస్పెండ్‌ అయిన వారిని, వారికి మద్దతిస్తున్న ఏఎంసీ అధికారులు, సంఘ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని