logo

విజయవాడలో అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్‌ సేవలు

మహా నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యున్నతశ్రేణి డయాగ్నోస్టిక్‌ సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో నీజెన్‌ డయాగ్నోస్టిక్స్‌ను విజయవాడలో ప్రారంభించడం అభినందనీయమని రెయిన్‌ బో హాస్పిటల్స్‌ సీఎండీ డాక్టర్‌ రమేష్‌ కంచర్ల పేర్కొన్నారు.

Published : 01 Jul 2024 05:01 IST

నీజెన్‌ డయాగ్నోస్టిక్స్‌ను ప్రారంభిస్తున్న డాక్టర్‌ రమేష్‌ కంచర్ల. పక్కనే సజ్జా కిషోర్‌బాబు, డాక్టర్‌ రామ్‌ ప్రకాష్‌ తదితరులు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : మహా నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యున్నతశ్రేణి డయాగ్నోస్టిక్‌ సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో నీజెన్‌ డయాగ్నోస్టిక్స్‌ను విజయవాడలో ప్రారంభించడం అభినందనీయమని రెయిన్‌ బో హాస్పిటల్స్‌ సీఎండీ డాక్టర్‌ రమేష్‌ కంచర్ల పేర్కొన్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ప్రపంచ స్థాయి వ్యాధి నిర్ధారణ వ్యవస్థగా నీజెన్‌ అత్యుత్తమ సేవలు అందిస్తుందని తెలిపారు. ఆదివారం సూర్యారావుపేటలో నీజెన్‌ డయాగ్నోస్టిక్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొట్టమొదటి అత్యాధునిక రిఫరల్‌ ల్యాబ్, స్పెషాలిటీ ల్యాబ్స్, జినోమిక్స్‌.. ప్రజలకు ఉపకరిస్తాయన్నారు. నీజెన్‌ ఎండీ డాక్టర్‌ రామ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ.. నిర్ధిష్ట కాల వ్యవధిలో అత్యంత ఖచ్చితత్వంతో పరీక్షల ఫలితాలు అందిస్తామని చెప్పారు. మెట్రో నగరాల్లోని ల్యాబ్‌ల నుంచి ఫలితాల కోసం రోజుల తరబడి ఎదురు చూడకుండా అత్యాధునిక సాధన సంపత్తి, నిష్ణాతులైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, క్లినికల్‌ బృందాలతో నీజెన్‌ రూపు దిద్దుకుందని వివరించారు. నీజెన్‌లో జెనెటిక్స్, ఫార్మాకో జినోమిక్స్, మైక్రోబయాలజీ, మాలిక్యులర్‌ బయాలజీ, రేడియాలజీ, బయో కెమిస్ట్రి, పాథాలజీ, హెమలాలజీ, ఇమ్యునాలజీ తదితర విభాగాలకు చెందిన దాదాపు 2వేలకు పైగా పరీక్షలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్‌ రామ్‌ ప్రకాష్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో పవర్‌ మెక్‌ ప్రాజెక్టు సీఎండీ సజ్జా కిషోర్‌బాబు, వైద్య ప్రముఖులు, అంతర్జాతీయ డయాగ్నోస్టిక్స్‌ సాధన సంపత్తి ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని