logo

సహకార బ్యాంకులో అవకతవకలపై విచారించండి

గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పాసు పుస్తకాలతో పొందిన రుణాలు పొందడం, ఇతర అవకతవకలపై విచారించాలని బ్యాంకు పర్సన్‌ ఇన్‌ఛార్జి, జేసీ జి.రాజకుమారికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆదేశించారు.

Published : 01 Jul 2024 04:58 IST

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ 

సమీక్షలో కేంద్ర సహాయ మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ తదితరులు

గుంటూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పాసు పుస్తకాలతో పొందిన రుణాలు పొందడం, ఇతర అవకతవకలపై విచారించాలని బ్యాంకు పర్సన్‌ ఇన్‌ఛార్జి, జేసీ జి.రాజకుమారికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆదేశించారు. గుంటూరు కలెక్టర్‌ కార్యాలయంలో వ్యవసాయ, అనుబంధ విభాగాలతో ఆయన ఆదివారం సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సహకార బ్యాంకులో అవకతవకలపై ఇప్పటికే విజిలెన్స్‌ నివేదిక ప్రభుత్వానికి సమర్పించిందని, వాటిపై మరోసారి పరిశీలించాలని జేసీకి సూచించారు. ఇందులో తప్పు చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకులో అక్రమాలకు పాల్పడిన వారెవరైనా సరే చర్యలు తప్పకుండా ఉంటాయన్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులను రైతులకు అమ్మేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అటువంటి ఆలోచన చేసేవారు ఇప్పటికైనా మానుకోవాలని, లేకపోతే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, జేసీ జి.రాజకుమారి, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, బూర్ల రామాంజనేయులు, నసీర్‌ అహ్మద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని