logo

గురుకులాల సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు 62కు పెంచండి

తమ ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రభుత్వ గురుకులాల ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమాఖ్య సంస్థల (ఎఫ్‌జీఆర్‌టీఈవో) ఛైర్మన్‌ బి.సాల్మన్‌ విజ్ఞప్తి చేశారు.

Published : 01 Jul 2024 04:51 IST

ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం అందజేస్తున్న సాల్మన్, పక్కన హర్షవర్ధన్‌

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: తమ ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రభుత్వ గురుకులాల ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమాఖ్య సంస్థల (ఎఫ్‌జీఆర్‌టీఈవో) ఛైర్మన్‌ బి.సాల్మన్‌ విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎంను శనివారం రాత్రి కలిసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రతినిధి బృంద సభ్యులం వినతిపత్రం అందజేసినట్లు ఆదివారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వం గురుకులాల సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును పెంచకపోవడంతో 60 సంవత్సరాలకే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ చేశారన్నారు. 010 పద్దు కింద వేతనాలు చెల్లించడంతో పాటు 765 మంది ఒప్పంద ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. సీఎంను కలిసిన వారిలో ఎఫ్‌జీఆర్‌ఈటీవో రాష్ట్ర నాయకులు ఎంఆర్‌సీవీ గిరిబాబు, చుక్కా నాగభూషణం, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల బోధనేతర సిబ్బంది సంఘం అధ్యక్షుడు కె.రెమిబాబు, అసోసియేట్‌ అధ్యక్షుడు గోగినేని హర్షవర్ధన్, నాయకులు ఎస్‌.డి.ఎ.ఖయ్యుం ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు