logo

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్సులు లేకుండా జిల్లాలోని వ్యాపారులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మకూడదని విజిలెన్స్‌ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు.

Published : 01 Jul 2024 04:49 IST

విజిలెన్స్‌ ఎస్పీ ఈశ్వరరావు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్సులు లేకుండా జిల్లాలోని వ్యాపారులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మకూడదని విజిలెన్స్‌ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ విక్రయ లైసెన్సులను అమ్మకాలు చేసే చోట, గోడౌన్లలో ప్రదర్శించాలని చెప్పారు. విక్రయ కేంద్రానికి వచ్చిన నిల్వలను స్టాక్‌ రిజిస్టర్‌లో నమోదు చేసిన తర్వాత మాత్రమే అమ్మకాలు ప్రారంభించాలన్నారు. అమ్మకం కేంద్రంలో విత్తన నిల్వలకు సంబంధించి ధ్రువపత్రాలను ఉత్పత్తిదారుడు, పంపిణీదారుడు నుంచి పొంది ఉండాలన్నారు. విక్రయకేంద్రంలో పురుగు మందుల నిల్వలకు సంబంధించి ప్రిన్సిపల్‌ సర్టిఫికెట్‌ను డీలర్‌ వద్ద ఉండాలని, ఎరువుల నిల్వలకు సంబంధించి తప్పనిసరిగా ఫారం-వో జత చేయాలని, దుకాణాల వద్ద నిల్వలు, ధరలను సూచించే బోర్డులు తప్పనిసరిగా నిత్యం ప్రదర్శించాలన్నారు. డీలర్లు డిమాండ్‌ ఉన్న రకాలను కృత్రిమ కొరత సృష్టించ కూడదన్నారు. ప్యాకెట్లు, బస్తాలపై ఉన్న గరిష్ఠ ధరలను మించి విక్రయించకూదడని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా వారి లైసెన్సులు రద్దుకు కలెక్టర్‌కు సిఫార్సు చేస్తామని ఎస్పీ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని