logo

లోక్‌ అదాలత్‌లో 1,454 కేసుల పరిష్కారం

జిల్లాలో శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 1,454 కేసులు పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో

Published : 30 Jun 2024 05:51 IST

కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న జిల్లా జడ్జి పార్థసారథి, లోక్‌అదాలత్‌ కార్యదర్శి లీలావతి 

గుంటూరు లీగల్‌ న్యూస్‌టుడే: జిల్లాలో శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 1,454 కేసులు పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో 166 సివిల్, 708 క్రిమినల్, 152 వాహన ప్రమాద బీమా, 202 చెల్లని చెక్కుల, 80 వివాహ సంబంధమైన కేసులను పరిష్కరించి బాధితులకు సుమారు రూ. 38 కోట్లు పరిహారం మంజూరు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార లోక్‌ అదాలత్‌ ఛైర్మన్‌ వై.వి.యస్‌.బి.జి.పార్థసారథి, కార్యదర్శి లీలావతి నగరంలో జరిగిన న్యాయస్థానాల్లో లోక్‌ అదాలత్‌లను పరిశీలించి పలు సూచనలు చేశారు. కక్షిదారులు, పొలీసులు, న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, సహకరించిన అందరికీ కార్యదర్శి లీలావతి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని