logo

పింఛను పండగకు సర్వం సిద్ధం

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ దూసుకుపోతోంది. జూలై ఒకటో తేదీన ఇంటి వద్దకే వెళ్లి పెంచిన మొత్తాన్ని అందించాలని నిర్ణయించింది.

Published : 30 Jun 2024 05:42 IST

1న ఇళ్ల వద్దకే సొమ్ము అందించేలా ఏర్పాట్లు 

ప్రత్తిపాడు, మేడికొండూరు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ దూసుకుపోతోంది. జూలై ఒకటో తేదీన ఇంటి వద్దకే వెళ్లి పెంచిన మొత్తాన్ని అందించాలని నిర్ణయించింది. ఆ మేరకు నిధులను విడుదల చేసి పంపిణీకి సిద్ధం చేసింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 32,796 మంది పింఛన్‌దారుల చేతికి రూ.22.20 కోట్ల నగదును ప్రభుత్వ సిబ్బంది ద్వారా అందించనుంది. ఇందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికతో సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది. ఈనెల 30న ఆదివారం సెలవు కావడంతో శనివారం పింఛన్లు పంపిణీ చేసే సచివాలయ సిబ్బంది, యువ వీఆర్‌ఏలు, అంగన్వాడీ సూపర్‌వైజర్లు, ప్రభుత్వ కార్యాలయాల్లోని జూనియర్‌ అసిస్టెంట్లకు పింఛన్లు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించింది. 

మూడు నెలలకు కలిపి రూ.7 వేలు..

పింఛన్ల పంపిణీకి అవసరమైన వివిధ శాఖల సిబ్బందిని ఎంపీడీవోలు సిద్ధం చేశారు. మండలంలో ఉన్న మొత్తం పింఛన్లను ఆధారంగా సిబ్బందిని నియమించారు. ఒక్కొ సిబ్బందికి 50మంది నుంచి 60 మంది పింఛన్‌దారులు ఉండేలా తగు చర్యలు చేపట్టారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువు, డప్పు కళాకారులు వంటి 11 విభాగాల్లోని పింఛన్‌దారులకు జూలై, 1న పెంచిన రూ.4000 పింఛన్‌తో పాటు ఏప్రిల్, మే, జూన్‌లకు రూ.1000లు చొప్పున మొత్తం కలిపి రూ.7000లు ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు రూ.3 వేల నుంచి రూ.6 వేలకు, నూరు శాతం దివ్యాంగులైతే రూ.5000ల నుంచి రూ.15000లకు పెంచిన పింఛన్‌ను పంపిణీ చేయనుంది.  

ఉదయం ఆరు గంటలకే అందజేస్తాం..

జూలై 1న ఉదయం 6 గంటలకే ప్రభుత్వం తరఫున సిబ్బంది ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్‌ను అందజేస్తారు. లబ్ధిదారులు ఎవరైనా అందుబాటులో లేకుంటే వారికి రెండో తేదీన ఇస్తాం. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం. 

దుర్గాప్రసాద్, ఎంపీడీవో, ప్రత్తిపాడు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని