logo

అక్షర యోధుడు రామోజీరావు

చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సేవలు చిరస్మరణీయమని రాజధాని రైతులు, మహిళలు పేర్కొన్నారు.

Published : 30 Jun 2024 05:40 IST

అమరావతికి రూ.10 కోట్ల భారీ విరాళంపై హర్షం

తుళ్లూరులో నివాళులర్పిస్తూ.. 

తుళ్లూరు, న్యూస్‌టుడే: చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సేవలు చిరస్మరణీయమని రాజధాని రైతులు, మహిళలు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో శనివారం జోహార్‌ రామోజీరావు, జై అమరావతి అని నినాదాలు చేస్తూ నివాళులర్పించారు. ఇటీవల విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఆయన సంస్మరణ కార్యక్రమంలో రామోజీరావు కుమారుడు సీహెచ్‌ కిరణ్‌ అమరావతి నిర్మాణానికి రూ. 10 కోట్లు భారీ విరాళం అందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. రాజధానికి అమరావతి అని నామకరణం చేయడమే కాక పరిరక్షణకు అనుక్షణం కృషి చేసిన అక్షర యోధుడని కొనియాడారు. ఆయన ప్రజలకు చేసిన సేవల చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు.

రైతు కుటుంబం నుంచి మహోన్నత శిఖరాలకు..

కృష్ణా జిల్లాలో ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి మహోన్నత శిఖరాలను అధిరోహించారు. తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు.

ఆలూరి పావని, రాజధాని మహిళా రైతు, తుళ్లూరు

సేవలు మరువలేనివి

రామోజీ గ్రూప్‌ సంస్థల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేసిన మహనీయుడు రామోజీరావు. అమరావతి నిర్మాణంలో భాగస్వాములవుతూ రూ.10 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించడం గొప్ప విషయం. 

భరత్, తుళ్లూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని