logo

చిన్నారి హితైషికి చేయూత

చిన్నారి హితైషిని ఆదుకొనేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. గుంటూరుకు చెందిన చిన్నారి హితైషి (9 నెలలు) స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫి (ఎస్‌ఏంఏ) అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది.

Published : 29 Jun 2024 05:40 IST

పట్నంబజారు, న్యూస్‌టుడే: చిన్నారి హితైషిని ఆదుకొనేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. గుంటూరుకు చెందిన చిన్నారి హితైషి (9 నెలలు) స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫి (ఎస్‌ఏంఏ) అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. వ్యాధి చికిత్సకు రూ.16 కోట్ల ఖరీదైన ఇంజక్షన్‌ వాడాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయమై ఇటీవల ‘ఈనాడు‘లో ‘సహృదయమా స్పందించు.. చిరంజీవిగా దీవించు’ శీర్షికన కథనం ప్రచురితమవ్వగా.. పలువురు దాతలు స్పందించి సాయం చేస్తున్నారు. సోమవారం నుంచి గురువారం వరకు రూ.3.30 లక్షలు, శుక్రవారం రూ.2.10 లక్షలు హితైషి తల్లిదండ్రుల ఖాతాకు జమ చేశారు. వీరిలో దుర్గా ప్రసాద్‌ రూ.31,500 (కాకినాడ), తేజశ్రీ రూ.1,01,00 (హైదరాబాద్‌), అస్లామ్‌ రూ.50 వేలు (విజయవాడ) శివ రూ.8వేలు (యుఎస్‌ఎ), కృష్ణన్‌ రూ.20 వేలు (చిత్తూరు) అందజేశారు. తమ కుమార్తెను ఆదుకొనేందుకు ఆర్థిక సాయం చేసిన వారికి హితైషి తల్లిదండ్రులు ప్రీతమ్, గాయత్రి కృతజ్ఞతలు తెలిపారు. దాతలు 77940 24001, 89191 89067 ఫోన్‌ నంబర్లతో సంప్రదించాలని వారు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని