logo

కాన్వాయ్‌ ఆపి.. ప్రసాదం స్వీకరించిన సీఎం

రాజధాని మహిళలు అందించిన గ్రామ దేవత పోలేరమ్మ ప్రసాదం, తిరుమల శ్రీవారి శేష వస్త్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీకరించారు.

Published : 29 Jun 2024 05:17 IST

అభివాదం చేస్తూ ప్రసాదాలు స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని మహిళలు అందించిన గ్రామ దేవత పోలేరమ్మ ప్రసాదం, తిరుమల శ్రీవారి శేష వస్త్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీకరించారు. రాజధాని గ్రామం మందడంలో శుక్రవారం అమ్మవారి ఆలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజధాని మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఎన్డీయే కూటమి పాలనలో అమరావతి నిర్మాణం శరవేగంగా కొనసాగాలని, రాష్ట్రం సుభిÅక్షంగా ఉండాలని వేడుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్తుండగా ప్రసాదాలు అందజేసేందుకు మహిళలంతా రహదారి వెంబడి నిల్చున్నారు. దీన్ని గమనించిన చంద్రబాబు వాహన శ్రేణిని ఆపి వారు అందించిన ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ‘జై అమరావతి.. జై చంద్రబాబు.. ఐదు కోట్ల కలల రాజధాని అమరావతి’ అని మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తమ అభ్యర్థనను మన్నించినందుకు మహిళా రైతులు ఆలూరి రాగలత తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్‌ పరదాల మాటున తప్పించుకుని తిరిగే వారని, కానీ చంద్రబాబు ప్రజా ముఖ్యమంత్రి అని మరోసారి నిరూపితమైందని కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని