logo

Cyber Crime: షేర్‌ మార్కెట్‌ పేరుతో రూ.59 లక్షలకు టోకరా

షేర్‌ మార్కెట్‌లో నగదు పెడితే రెట్టింపు అవుతుందని ఆన్‌లైన్‌ ద్వారా నమ్మించి రూ.59 లక్షలు స్వాహా చేసిన ఘటన ఇది.

Updated : 28 Jun 2024 10:36 IST

గుంటూరు జిల్లా చేబ్రోలులో కేసు నమోదు

చేబ్రోలు, న్యూస్‌టుడే: షేర్‌ మార్కెట్‌లో నగదు పెడితే రెట్టింపు అవుతుందని ఆన్‌లైన్‌ ద్వారా నమ్మించి రూ.59 లక్షలు స్వాహా చేసిన ఘటన ఇది. చేబ్రోలు ఎస్సై మహేష్‌ కుమార్‌ కథనం ప్రకారం... చేబ్రోలు మండలం శేకూరుకు చెందిన గృహిణి రాధిక ఇటీవల స్టాక్‌ మార్కెట్ గురించి తెలుసుకుందామని గూగుల్‌లో శోధిస్తున్న క్రమంలో సీ3 విక్రమ్‌ ఛటర్జీ స్టాక్‌ ఎలైట్‌ సెంటర్‌ గ్రూప్‌ను ఎంచుకున్నారు. వారు పంపిన లింక్‌లో తన చరవాణి నంబరును నమోదు చేయడంతో ఆమె వాట్సప్‌కు ఐశ్వర్య అనే మహిళ నుంచి మెసేజ్‌ వచ్చింది. తాను విక్రం చటర్జీ అసిస్టెంట్‌నని పరిచయం చేసుకున్నారు. ఆయన ప్రతి రోజూ స్టాక్‌ మార్కెట్‌పై అప్‌డేట్స్, తరగతులు నిర్వహిస్తారని ఈ ఏడాది మార్చిలో ఒక లింకు పంపారు. దానిని రోజూ క్లిక్‌ చేయడం వల్ల రేటింగ్‌ పెరుగుతుందని, తద్వారా మీకు నగదు బహుమానంగా వస్తుందని ఐశ్వర్య నమ్మబలికింది. రోజు ఆయన తరగతులు వింటూ మే 6వ తేదీన ఈటీఎఫ్‌ స్టాక్‌ మార్కెట్‌లో షేర్లు కొనుగోలు చేసేందుకు రూ.1 లక్ష నగదు పంపగా.. కొన్ని రోజులకు షేర్ల విలువ పెరిగిందని రూ.30 వేలు పంపారు. అలా నమ్మబలుకుతూ మూడు ద]ఫాలుగా రూ.59 లక్షలు ఐశ్వర్య వాట్సప్‌లో పంపిన ఖాతాకు రాధిక పంపారు. కొన్ని రోజులు తరవాత తమ నగదు వెనక్కి పంపాలని ఐశ్వర్యను కోరడంతో మీ నగదు అంతా రెట్టింపు అయ్యే ప్లాన్‌లో ఉన్నాయని, ఒకే సారి రూ.1,32,52,000 వస్తాయని, దీనికి గాను ముందుగా 30 శాతం చెల్లించాలని, లేకుంటే నగదు మొత్తం పోతాయని చెప్పడంతో మోసపోయానని గుర్తించిన రాధిక చేబ్రోలు పోలీసులను ఆశ్రయించారు. గురువారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై మహేష్‌ కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని