logo

Somu Veerraju: ఈవీఎంలను తప్పుపట్టడం హాస్యాస్పదం: సోము వీర్రాజు

ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ఏ మాత్రం మారలేదని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు.

Updated : 29 Jun 2024 07:12 IST

మాట్లాడుతున్న వీర్రాజు

దేవీచౌక్‌: ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ఏ మాత్రం మారలేదని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈవీఎం ట్యాంపరింగ్‌ గురించి రాహుల్‌గాంధీ ప్రస్తావించడం, రాష్ట్రంలో కూడా తమకు అనుమానాలున్నాయని ఓడిపోయిన పార్టీ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర ప్రజలు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చారన్నారు. దాన్ని వైకాపా హుందాగా స్వీకరించాలని సూచించారు. వైకాపా ఎంపీలు అవినాష్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డిలు భాజపాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు కదా అని ఒక విలేకరి ప్రశ్నించగా.. దానిపై తమకు ఎటువంటి సమాచారం లేదని సోము వీర్రాజు చెప్పారు. వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా లేమన్నారు. సమావేశంలో భాజపా జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని