logo

Politics: వైకాపా ఎత్తిపోతలను పట్టించుకోలేదు: ఎమ్మెల్యే

గత వైకాపా ప్రభుత్వం బటన్ నొక్కుతున్నామని ప్రలోభపెట్టి ఎక్కడా ఎత్తిపోతల పథకాలను పట్టించుకోలేదని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు అన్నారు.

Updated : 01 Jul 2024 21:05 IST

తాళ్లపూడి: గత వైకాపా ప్రభుత్వం బటన్ నొక్కుతున్నామని ప్రలోభపెట్టి ఎక్కడా ఎత్తిపోతల పథకాలను పట్టించుకోలేదని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు అన్నారు. తాళ్లపూడి మండలంలోని పైడిమెట్ట ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు ముళ్లపూడి శ్రీరామచంద్రమూర్తి, నూతన కార్యవర్గ సమావేశంలో భాగంగా సోమవారం సాయంత్రం మోటార్ల స్విచ్‌ఆన్ చేసి నీరు విడుదల చేశారు. తెదేపా హయాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలను వైకాపా ఐదేళ్ల పాలనలో పటించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు ముళ్లపూడి శ్రీరామచంద్రమూర్తి, ద్విసభ్య కమిటీ సభ్యులు సుబ్బారాయచౌదరి, రామకృష్ణ చాగల్లు మాజీ జడ్పీటీసీ సభ్యుడు విక్రమాదిత్య, నియోజకవర్గ పరిశీలకుడు శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే టివీ రామారావు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ చిన్ని, తెదేపా, భాజపా మండల అధ్యక్షులు పరమేశ్వరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాళ్లపూడి మండలంలోని పెద్దేవం, రావూరుపాడులో ఎన్డీఏ కూటమీ గెలుపు విజయోత్సవ సంబరాలను సోమవారం రాత్రి బాణా సంచా పేల్చుతూ, అభిమానుల కేరింతలతో సాగింది. ఈ సంబరాలకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరై గెలిపించిన ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. అభిమానులు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావును భారీ గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు రేఖపల్లి ముత్యాలరావు, క్లస్టర్ ఇన్‌ఛార్జి సిద్దా దుర్గారావు, నాయకులు సిద్దా మురళీ, కోడి శంకరం, నామన చిన్నబూరయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని