logo

నిత్య స్మరణీయుడు.. అల్లూరి: మంత్రి దుర్గేష్‌

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్వాతంత్య్రం నా జన్మ హక్కు అంటూ పోరాటం సాగించిన అల్లూరి సీతారామరాజు నిత్య స్మరణీయుడని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు.

Published : 05 Jul 2024 04:08 IST

అల్లూరికి నివాళి అర్పించిన మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, బలరామకృష్ణ, కలెక్టర్‌ ప్రశాంతి, అధికారులు 

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్వాతంత్య్రం నా జన్మ హక్కు అంటూ పోరాటం సాగించిన అల్లూరి సీతారామరాజు నిత్య స్మరణీయుడని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా గురువారం గోదావరి గట్టున ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జయంతి వేడుకలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ నిర్ణయం తీసుకోవడం గర్వకారణమన్నారు. అల్లూరి స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి అందరం పునరంకితం కావాలని ఆకాంక్షించారు. కలెక్టర్‌ పి.ప్రశాంతి మాట్లాడుతూ అల్లూరితో ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన అనుబంధం ఉండటం అదృష్టమన్నారు. గోదావరి తీరంలో బాల్యం గడిచిందని, ఆయన స్మృతులు పదిలంగా ఉన్నాయన్నారు. శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్య్రం సాధ్యమని నమ్మి ప్రాణాలర్పించిన పోరాట యోధుడు అల్లూరి అని కొనియాడారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు పదిలంగా అందించాలన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్, ఆర్డీవో చైత్రవర్షిణి, పర్యాటకశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు వి.స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని