logo

హెలీపోర్టు.. ఇన్నాళ్లకు మళ్లీ కదలిక

కాకినాడ సముద్రతీరంలో స్మార్ట్‌ సిటీ నిధులు సుమారు రూ.3.5 కోట్లతో గతంలో నిర్మించిన హెలీపోర్టుకు కదలిక రానుంది.

Published : 05 Jul 2024 04:26 IST

హెలీపోర్టును పరిశీలించి చర్చిస్తున్న కార్పొరేషన్‌ కమిషనర్‌ వెంకట్రావు, ఇతర అధికారులు 

సర్పవరం జంక్షన్, న్యూస్‌టుడే: కాకినాడ సముద్రతీరంలో స్మార్ట్‌ సిటీ నిధులు సుమారు రూ.3.5 కోట్లతో గతంలో నిర్మించిన హెలీపోర్టుకు కదలిక రానుంది. దీనిని వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ కార్పొరేషన్‌ కమిషనర్, స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ సీఈవో జె.వెంకట్రావు తెలిపారు. సముద్రతీరంలోని హెలీపోర్టును గురువారం అధికారులతో కలసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రెండు హెలీప్యాడ్లు, భవనంతోపాటు పలు సౌకర్యాలు కల్పించామని, ఏ విధంగా వినియోగంలోకి తీసుకురావాలనే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని