logo

పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం: గోరంట్ల

కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు.

Published : 05 Jul 2024 03:46 IST

స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల 

టి.నగర్, న్యూస్‌టుడే: కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేంద్రవరం నగరంలోని వీఎల్‌పురం, చక్రధర్‌ హాస్పిటల్‌ పక్కన స్వచ్ఛభారత్‌లో భాగంగా గురువారం తుప్పలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డెంగీ, డయేరియా వంటివి రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టించుకోకపోవడంతో వ్యర్థాలు పెరిగిపోయాయన్నారు. ఇకనుంచి పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని