logo

కష్టకాలంలో అండగా నిలిచిన వారికి వందనం

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిక్కెట్‌ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ సమయంలో మా కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు వందనం అంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Published : 04 Jul 2024 04:10 IST

మోకాళ్లపై వంగి ప్రణమిల్లుతున్న నల్లమిల్లి  

అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి: బిక్కవోలు: ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిక్కెట్‌ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ సమయంలో మా కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు వందనం అంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బలభద్రపురంలో బుధవారం జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల బరిలో టికెట్‌ కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ‘న్యాయం కోసం నల్లమిల్లి’ పేరుతో మా కుటుంబసభ్యులం అందరం అనేక గ్రామాల్లో తిరిగాం. మేమున్నాం మీ వెంట అంటూ.. కార్యకర్తలు అండగా నిలిచారు. ఆ క్రతువులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి వందనం అంటూ మోకాళ్లపై కూర్చుని వంగి ప్రణమిల్లారు. ఒక్కసారిగా ఈ సంఘటనకు కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని