logo

టీచ్‌ టూల్‌తో బోధనలో నైపుణ్యం

ఉపాధ్యాయుల బోధన పద్ధతిని ఒక నమూనాలో మదింపు చేసేందుకు టీచ్‌ టూల్‌ని ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు చెప్పారు.

Published : 03 Jul 2024 04:13 IST

సూచనలిస్తున్న డీఎస్‌ఈఓ కె.వాసుదేవరావు, డీవైఈఓ నారాయణ తదితరులు

శ్యామలాసెంటర్‌(రాజమహేంద్రవరం): ఉపాధ్యాయుల బోధన పద్ధతిని ఒక నమూనాలో మదింపు చేసేందుకు టీచ్‌ టూల్‌ని ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు చెప్పారు. డీఎంహెచ్‌ పాఠశాలలో ఉపాధ్యాయులకు పది రోజులపాటు నిర్వహించే టీచ్‌ టూల్‌ శిక్షణ తరగతులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఉపాధ్యాయులకు మెరుగైన పద్ధతులు అందించేందుకు, బోధన మెరుగుపరచుకోవటం, ప్రస్తుతం బోధన పద్ధతులను కొలమానం చేయటం వంటి లక్ష్యాలతో టీచ్‌ అనే సాధనం అభివృద్ధి చేశారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లాలో 8 మండలాలకు చెందిన 104 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొనగా విషయ నిపుణులుగా ఎన్‌.శ్రీనివాస్, టి.ప్రవీణ్, శిరీష, రేఖ, స్వప్న, శ్రీనివాస్‌లు వ్యవహరించారు.

బోధనలో మెలకువలు నేర్చుకోవాలి: టీచ్‌ టూల్‌ శిక్షణ తరగతులను జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఎస్‌.సుభాషిణి మంగళవారం సందర్శించారు. విద్యలో ఉత్తమ ప్రమాణాలు సాధించాలంటే బోధనలో మెలకువలు నేర్చుకోవాలని, మారుతున్న విధానాలకు అనుగుణంగా బోధన నైపుణ్యాన్ని మెరుగు పరచుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని