logo

భవనం ఖాళీ చేయించారు.. న్యాయం చేయండి

కాకినాడ నగరంలోని సత్యప్రసన్ననగర్‌ భాస్కర్‌ ఎస్టేట్స్‌ బాధితులు మంగళవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు.  తామెంతో కష్టపడి బిల్డర్‌ ద్వారా బహుళ అంతస్తు భవనాన్ని నిర్మించుకున్నామని, అది కుంగిపోయిందనే నెపంతో అయిదేళ్ల కింద ఖాళీ చేయించారని వాపోయారు.

Published : 03 Jul 2024 04:12 IST

భాస్కర ఎస్టేట్స్‌ బాధితుల నిరసన

నిరసన తెలుపుతున్న బాధితులు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కాకినాడ నగరంలోని సత్యప్రసన్ననగర్‌ భాస్కర్‌ ఎస్టేట్స్‌ బాధితులు మంగళవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు.  తామెంతో కష్టపడి బిల్డర్‌ ద్వారా బహుళ అంతస్తు భవనాన్ని నిర్మించుకున్నామని, అది కుంగిపోయిందనే నెపంతో అయిదేళ్ల కింద ఖాళీ చేయించారని వాపోయారు. ఇప్పటికీ ఆ భవనం బాగానే ఉందన్నారు. ఆ భవనం ఖాళీ చేయించడం వెనుక అప్పటి ఒక ప్రజాప్రతినిధి హస్తం ఉందనే ఆనుమానాలు ఉన్నాయన్నారు. ఈ భవన స్థలాన్ని ఆక్రమించేయడానికి ఇదంతా చేసేశారనే ప్రచారం జరిగిందన్నారు. ఇప్పటికైనా బిల్డర్‌తో మళ్లీ అదే స్థలంలో భవనం నిర్మించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కొంత సాయం చేస్తే, తాము కొంత సొమ్ము సమకూర్చుకుని భవనం నిర్మించుకుంటామన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు వినతి పత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు