logo

అయిదేళ్లు నిద్రపోయారు.. గుంతల రోడ్లు మిగిల్చారు..

గత వైకాపా ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయాలు నిర్మించుకొనేందుకు పెట్టిన శ్రద్ధ రహదారుల మరమ్మతులకు పెట్టకపోవడంతో ప్రస్తుతం రహదారులు రూపురేఖలు కోల్పాయాయి..

Published : 03 Jul 2024 04:11 IST

పతంజలి కర్మాగారం ఎదుట చెరువును తలపిస్తున్న రహదారిపై గుంత

గత వైకాపా ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయాలు నిర్మించుకొనేందుకు పెట్టిన శ్రద్ధ రహదారుల మరమ్మతులకు పెట్టకపోవడంతో ప్రస్తుతం రహదారులు రూపురేఖలు కోల్పాయాయి.. ఇక్కడ కన్పిస్తున్నది కాకినాడ దుమ్ములపేట రైల్వే గేటు నుంచి కుంభాభిషేకం రేవు వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారి దుస్థితి. పోర్టుకు రాకపోకలు సాగించే  వాహనాలు, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులతో నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి కంకరతేలి పెద్ద గుంతలతో ప్రమాదకరంగా మారింది.. దీంతో నిత్యం నరకం తప్పడం లేదు. మరోవైపు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రహదారిపై నీరు నిల్వ ఉండటంతో ఎక్కడ ఎంత పరిమాణంలో ఉన్న గుంత ఉందో తెలియక వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంత్‌ దృష్టికి తీసుకెళ్లగా ప్రస్తుతం అత్యవసర మరమ్మతులకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, తొందరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

ఇలా ఉంటే ఎలా వెళ్లేది

వాహనదారులకు తప్పని తిప్పలు

ఈనాడు, కాకినాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని