logo

వైకాపా పాలనలో బౌద్ధారామాలకు కొరవడిన రక్షణ

రాష్ట్రంలోని అన్ని బౌద్ధ ఆరామాలను పరిరక్షించుకుందామని బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (బీఎస్‌ఐ) ఏపీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు వై.హరిబాబు అన్నారు.

Published : 02 Jul 2024 05:27 IST

సంఘీభావం తెలుపుతున్న దళిత సంఘాల ప్రతినిధులు 

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అన్ని బౌద్ధ ఆరామాలను పరిరక్షించుకుందామని బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (బీఎస్‌ఐ) ఏపీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు వై.హరిబాబు అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం కాకినాడ వచ్చారు. స్థానికంగా నిర్వహించిన సమావేశానికి టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సబ్బతి ఫణేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్నిచోట్ల బౌద్ధ ఆరామాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అందుకు జిల్లాలోని కొడవలి బౌద్ధ ఆరామమే నిదర్శనమన్నారు. రక్షించుకోవటంతో పాటు బౌద్ధాన్ని ఏపీలో వ్యాపింప చేయడానికి బీఎస్‌ఐ కృషి చేస్తోందన్నారు. దీనికోసం జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఫణేశ్వరరావు మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చాకే కొడవలి బౌద్ధారామానికి రక్షణ కొరవడిందని ఆరోపించారు. అప్పటి పాలకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్కడి కొండను కొల్లగొట్టారన్నారు. బీఎస్‌ఐ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అధ్యక్షుడు కాశి రాంబోధి, ప్రధాన కార్యదర్శి ములపర్తి సత్యనారాయణ, ప్రతినిధులు జల్లి రంగారావు, వై.వెంకట్రాజు, జంగా రాజేంద్రకుమార్, ఎస్‌.బాలకృష్ణ, జానపాటి నానిబాబు, సుబ్బరాజు, బూసి నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని