logo

ఎత్తిపోతలకు పెరుగుతున్న నీటిమట్టం

ఎగువ ప్రాంతం నుంచి పెరుగుతున్న వరదనీటితో దిగువున గల పలు ఎత్తిపోతల పథకాల వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది.

Published : 02 Jul 2024 04:59 IST

పోలవరం దిగువ కాఫర్‌డ్యాం వద్ద ముంపులోకి చేరిన రోడ్డు 

ఎగువ ప్రాంతం నుంచి పెరుగుతున్న వరదనీటితో దిగువున గల పలు ఎత్తిపోతల పథకాల వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. సీతానగరం మండలంలోని గోదావరి ఎడమ గట్టున పురుషోత్తపట్నం, పుష్కర, తొర్రిగడ్డ, సత్యసాయి తదితర ప్రాజెక్టుల వద్ద సోమవారం నాటికి 14.2 మీటర్లకు చేరింది. మోటార్లు ఆన్‌చేస్తే నీరు విడుదలయ్యేలా ప్రవాహం చేరింది. పోలవరం ప్రాజెక్టు పనులకు దిగువ కాఫర్‌డ్యాం వద్ద వేసిన రోడ్డు వరద ముంపులోకి చేరడంతో ఇసుక తవ్వకాలు నిలిపివేశారు. పాపికొండలకు వెళ్లే పర్యాటకుల లాంచీలను దేవీపట్నం మండలం పోశమ్మగండి వద్ద నుంచి బయలుదేరేలా ఏర్పాట్లు చేశారు. జులై రెండో వారానికల్లా ప్రాజెక్టుల నుంచి మెట్టప్రాంతానికి సాగునీరు విడుదల చేసేలా కార్యాచరణ ఉందని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. 
- న్యూస్‌టుడే, సీతానగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని