logo

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం

ఉద్యోగులు, పింఛనుదారుల ఆరోగ్య సంరక్షణకు తొలి ప్రాధాన్యమిస్తామని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ప్రమోద్‌ కే మిశ్రా పేర్కొన్నారు.

Published : 02 Jul 2024 04:56 IST

వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న ఎస్‌బీఐ డీజీఎం ప్రమోద్‌ కే మిశ్రా 

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: ఉద్యోగులు, పింఛనుదారుల ఆరోగ్య సంరక్షణకు తొలి ప్రాధాన్యమిస్తామని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ప్రమోద్‌ కే మిశ్రా పేర్కొన్నారు. బ్యాంకు ఆవిర్భావ దినోత్సవం, వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని పరిపాలనా కార్యాలయ ఆవరణలో చీఫ్‌ మేనేజర్‌ టి.శ్రీధర్, బ్యాంకు వైద్యాధికారి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి పలు సూచనలు చేశారు. ఉద్యోగులు, ఎస్‌బీఐ పింఛనుదారులు మొత్తం 430 మందికి దంత, మధుమేహం, నేత్ర, గుండె సంబంధిత పరీక్షలు చేసి మందులు అందజేశారు. అనంతరం ఎస్‌బీఐ ఆరోగ్య బీమా కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో పింఛనుదారుల సంఘం అధ్యక్షుడు ఆదివిష్ణు, నాయకుడు శేషుకుమార్, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని