logo

ఒక్కరోజులో 96.29 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

జిల్లాలో వివిధ కేటగిరిల కింద 2,41,771 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు రూ.163.36 కోట్ల మేర అందించాల్సి ఉండగా.. ఒక్క రోజులోనే 2,32,814 మందికి రూ.157.30 కోట్లు కూటమి ప్రభుత్వం అందించింది.

Published : 02 Jul 2024 04:54 IST

రాజమహేంద్రవరంలో దివ్యాంగురాలికి పింఛను అందిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే, కమిషనర్‌ తదితరులు 

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌: జిల్లాలో వివిధ కేటగిరిల కింద 2,41,771 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు రూ.163.36 కోట్ల మేర అందించాల్సి ఉండగా.. ఒక్క రోజులోనే 2,32,814 మందికి రూ.157.30 కోట్లు కూటమి ప్రభుత్వం అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా సోమవారం ఉదయం 5 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను పంపిణీ ప్రారంభించారు. రాత్రి 10 గంటల సమయానికి 96.29 శాతం పంపిణీ పూర్తి చేసినట్లు కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. ఇళ్లవద్ద అందుబాటులో లేనివారికి ఫోన్లు చేస్తున్నామని, మంగళవారం మిగతా లబ్ధిదారులకు పింఛన్లు అందించి నూరుశాతం పూర్తి చేస్తామని చెప్పారు. 4,092 మంది సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ప్రక్రియ సజావుగా నిర్వహించడంతో వారిని కలెక్టర్‌ అభినందించారు. రాజమహేంద్రవరం నగరంలోని వి.ఎల్‌.పురం, గ్రామీణ మండలం కొంతమూరులో జరిగిన కార్యక్రమాల్లో కలెక్టర్‌ పాల్గొని లబ్ధిదారులకు పింఛను నగదు, ముఖ్యమంత్రి సందేశ లేఖ అందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని