logo

బండి కాదు మొండి..

గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ బస్సుల నిర్వహణను పూర్తిగా వదిలేయడంతో సామాన్యులకు ఇక్కట్లు తప్పట్లేదు.

Published : 02 Jul 2024 04:41 IST

ఆగిపోయిన బస్సును తోస్తున్న ప్రయాణికులు, స్థానికులు 

కొవ్వూరు పట్టణం, చాగల్లు, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ బస్సుల నిర్వహణను పూర్తిగా వదిలేయడంతో సామాన్యులకు ఇక్కట్లు తప్పట్లేదు.  సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో కొవ్వూరు రోడ్‌కం రైలు వంతెన ఎక్కి, కొంతదూరం వెళ్లిన బాపట్ల డిపో సూపర్‌ లగ్జరీ బస్సు ఆగిపోయింది. కొన్ని క్షణాల తేడాలో ఏలూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు ఇంజిను పనిచేయక నిలిచిపోయింది. దీంతో కొవ్వూరు నుంచి వెళ్లేవి, రాజమహేంద్రవరం నుంచి వచ్చే వాహనాలు నిలిచిపోయాయి. ఏలూరు డిపో బస్సును ప్రయాణికులు, స్థానికులు దిగి ముందుకు తోసినా  ముందుకు వెళ్లి మళ్లీ మొరాయించింది. అత్యవసర పనులు, విద్యాలయాలు, ఇతర అవసరాలకు వెళ్లే వారంతా చేసేది లేక ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. చివరికి ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీసీకి చెందిన సిబ్బంది వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని