logo

పింఛన్‌ పంపిణీ అదృష్టం: మంత్రి దుర్గేష్‌

పండుగ వాతావరణంలో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు.

Published : 02 Jul 2024 04:35 IST

నిడదవోలు, న్యూస్‌టుడే: పండుగ వాతావరణంలో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. నిడదవోలు మండలం గోపవరం వినాయకవీధిలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతో కలిసి మంత్రి సోమవారం ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల మంచికోరే ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. మేనిఫెస్టో అంశాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం ముందు ఆర్థిక సమస్యలున్నా ప్రజా సంక్షేమం కోసం పెంచిన పింఛను నగదును అందిస్తున్నామన్నారు. జిల్లాలో 2,44,302 మంది లబ్ధిదారులకు రూ.165.13 కోట్ల నగదు అందిస్తామని పేర్కొన్నారు. పింఛను పెంపుతో ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల భారం పడుతోందన్నారు. గడచిన మూడు నెలల కాలానికి పెంచిన పింఛనుతో మరో రూ.1650 కోట్లు అదనంగా ఖర్చవుతోందన్నారు. ప్రజా శ్రేయస్సు ఆలోచించే చంద్రబాబు, ప్రజా సంక్షేమాన్ని కోరే పవన్‌  అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం ఏర్పడిన పది రోజుల్లోనే రూ.4408 కోట్లను పింఛన్ల రూపంలో అందిస్తున్నట్లు చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని