logo

ఎస్‌ఈజెడ్‌ భూములు వెనక్కి తీసుకోవాలి

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలంలో ఎస్‌ఈజెడ్‌ ఎనిమిది వేల ఎకరాల భూములు తీసుకున్నారని.. ఇక్కడ ఒక్క పరిశ్రమ కూడా రానందున వాటిని తిరిగి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు.

Published : 02 Jul 2024 04:34 IST

దేవీచౌక్, న్యూస్‌టుడే: పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలంలో ఎస్‌ఈజెడ్‌ ఎనిమిది వేల ఎకరాల భూములు తీసుకున్నారని.. ఇక్కడ ఒక్క పరిశ్రమ కూడా రానందున వాటిని తిరిగి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని 20.88 లక్షల ఎకరాల వనసంరక్షణ సమితి(వీఎస్‌ఎస్‌) భూములను అటవీ హక్కుల చట్ట ప్రకారం గ్రామ సభలకు అప్పగించాలని కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో ఆదేశాలిచ్చినా ఇప్పటి వరకు అప్పగించలేదన్నారు. దీనిపై ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. వీఎస్‌ఎస్‌ భూములను గ్రామ సభలకు అప్పగిస్తే రాష్ట్రంలోని ఎనిమిది ఐటీడీఏల పరిధిలో నివాసం ఉంటున్నవారికి వాటిపై హక్కులు వస్తాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని