logo

ఏడీబీ రోడ్డు పనులు ముమ్మరం

ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు ఇక పూర్తిస్థాయిలో కొనసాగనున్నాయి. రాజానగరం, రంగంపేట మధ్య అత్యంత దయనీయంగా తయారైన ఈ రోడ్డు మరమ్మతుకు బీఎస్‌ఆర్‌ సంస్థ ఆదివారం చర్యలను చేపట్టింది.

Published : 01 Jul 2024 04:39 IST

గోవిందరాజపురం వద్ద మురుగు వెళ్లేందుకు పైపులైను ఏర్పాటుకు తవ్వుతున్న జేసీబీ 

రంగంపేట, న్యూస్‌టుడే: ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు ఇక పూర్తిస్థాయిలో కొనసాగనున్నాయి. రాజానగరం, రంగంపేట మధ్య అత్యంత దయనీయంగా తయారైన ఈ రోడ్డు మరమ్మతుకు బీఎస్‌ఆర్‌ సంస్థ ఆదివారం చర్యలను చేపట్టింది. గోవిందరాజపురం, వెంకన్నపేట, వడిశలేరు, రామస్వామిపేటల వద్ద ఏర్పడిన భారీ గోతుల్లో మెటల్‌ వేసి పూడ్చే పనులు జరిగాయి. ఈ గోతుల వల్ల ఇక్కడ కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయే పరిస్థితి ఉండేది. బురద, వర్షపు నీరు వెళ్లేందుకు భూమిలో పైపులైను ఏర్పాటు కోసం యంత్రాలతో కాలువను తవ్వారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ పనులకు తరచూ ఆటంకం కలిగింది. ముందుగా రోడ్డుపై నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టి గోతులను పూడ్చే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇపుడు తాత్కాలిక పనులపై దృష్టి సారించామని, క్రమక్రమంగా పనులు ముమ్మరం చేసి పూర్తిస్థాయిలో ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామని ఆర్‌.అండ్‌.బి(ఆర్‌.డి.సి) డీఈ భాస్కర్‌ ‘న్యూస్‌టుడే’కి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని