logo

మహిళా సాధికారతకు.. శేషకుమారి జీవితం నిదర్శనం

మహిళా సాధికారతకు లక్కరాజు శేషకుమారి జీవితమే నిదర్శనమని, అమె గొప్ప వారసత్వ సంపద, స్ఫూర్తి పంచి వెళ్లారని ప్రముఖ వక్త, ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌ సీఈవో, డైరక్టర్‌ నగ్మా ముల్లా అన్నారు.

Published : 01 Jul 2024 04:30 IST

మాట్లాడుతున్న డాక్టర్‌ చంద్రశేఖర్, చిత్రంలో కస్తూరి, నగ్మా ముల్లా, టిక్కు, ప్రసాదరాజు, పల్లంరాజు

గాంధీనగర్, న్యూస్‌టుడే: మహిళా సాధికారతకు లక్కరాజు శేషకుమారి జీవితమే నిదర్శనమని, అమె గొప్ప వారసత్వ సంపద, స్ఫూర్తి పంచి వెళ్లారని ప్రముఖ వక్త, ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌ సీఈవో, డైరక్టర్‌ నగ్మా ముల్లా అన్నారు. ప్రముఖ సామాజిక సేవకురాలు లక్కరాజు శేషకుమారి స్మారక ప్రసంగంలో భాగంగా ఆదివారం సూర్యకళామందిరంలో మహిళా సాధికారతపై నగ్మా మాట్లాడారు. శేషకుమారి పరంపరను అందరూ కొనసాగించాలన్నారు. ఆమె ఒక తల్లిగా, నాయకురాలిగా, సేవకురాలిగా సమాజంపై తనదైన ముద్ర వేశారన్నారు. ఆమెను స్మరించుకోవడానికి మనమంతా ఇక్కడికి వచ్చామన్నారు. నా జీవితం నుంచి నేను నేర్చుకున్న పాఠాలే మహిళా సాధికారత దిశగా అడుగులు వేసేలా చేశాయన్నారు. సంకురాత్రి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్, జేఎన్‌టీయూకే ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు, విశ్రాంత మేజర్‌ జనరల్‌ జ్యోతుల ప్రసాద్, కేంద్ర మాజీమంత్రి ఎంఎం.పళ్లంరాజు, టిక్కు, కైట్‌ విద్యాసంస్థల అధినేత పోతుల విశ్వం తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని