logo

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను తొలి దశలో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు.

Published : 01 Jul 2024 04:29 IST

మంత్రి దుర్గేష్‌ను సత్కరిస్తున్న శ్రేణులు

సీతానగరం: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను తొలి దశలో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. సీతానగరం మండలంలోని రఘుదేవపురం పంచాయతీ కార్యాలయంలో ఆదివారం మంత్రి మాట్లాడారు. పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసే ప్రదేశాలను పరిశీలిస్తున్నామన్నారు. పురుషోత్తపట్నం నుంచి లాంచీలలో పాపికొండలకు వెళ్లడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గతంలో పర్యాటకులు వచ్చేవారన్నారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో మట్టి దిబ్బలు, రాళ్లు తప్ప ఇంకా ఏమీ మిగల్లేదన్నారు. పోలవరం పనుల్లో గత వైకాపా ప్రభుత్వం ఘోరతప్పిదం చేసిందని, నిధులున్నా పనులు పూర్తి చేయకుండా ప్రాజెక్టు విధ్వంసానికి పాల్పడిందన్నారు. కూటమి అయిదేళ్లపాలనలో పోలవరం పూర్తిచేసి తీరతామన్నారు. జిల్లాకు పింఛను సొమ్ము రూ.164 కోట్లు పెరిగిందని, వీటిని అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రఘుదేవపురం పంచాయతీలో కూటమి శ్రేణులు మంత్రిని సత్కరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని