logo

ఎన్నాళ్లో వేచిన ఉదయం కూటమి అభయం

జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ పండగకు వేళయ్యింది.  ఉదయం 6 గంటల నుంచే గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో వీటిని లబ్ధిదారుల చెంతకు చేర్చనున్నారు.

Updated : 01 Jul 2024 05:06 IST

2,79,319 మందికి రూ.188.40 కోట్ల పింఛను లబ్ధి
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చేతుల మీదుగా పంపిణీ

గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫంక్షన్‌ హాలులో పింఛన్ల పంపిణీ సభకు ఏర్పాట్లు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ పండగకు వేళయ్యింది. ఉదయం 6 గంటల నుంచే గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో వీటిని లబ్ధిదారుల చెంతకు చేర్చనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సోమవారం గొల్లప్రోలులో లబ్ధిదారులకు స్వయంగా పింఛను సొమ్మును అందజేయనున్నారు. తొలిరోజు పంపిణీ పూర్తికాపోతే, మంగళవారం నాటికి  నూరుశాతం పూర్తి చేయాలని భావిస్తున్నారు. 

రూ.7 వేలు ఎన్టీఆర్‌ భరోసా

ఎన్నికల్లో సీఎం చంద్రబాబు పింఛను సొమ్ము రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. దివ్యాంగులకు రూ.3 వేల నుంచి రూ.6 వేలు పింఛను అందిస్తామని చెప్పారు. దీని ప్రకారం సోమవారం పెంచిన పింఛను పొమ్ము లబ్ధిదారులకు అందించనున్నారు. జిల్లాలో జులైలో 2,79,319 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. వీరిలో రూ.3 వేలు పింఛను తీసుకుంటున్న వారు 2.36 లక్షల మంది ఉన్నారు. వీరంతా 11 కేటగిరీల కింద ఉన్నారు. వీరికి ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి పెంచిన రూ.1000తో కలిపి ఈ నెల్లో రూ.7 వేలు చొప్పున సొమ్ము అందనుంది. దివ్యాంగులకు రూ.6 వేలు చొప్పున పంపిణీ చేస్తారు. మంచంపై కదల్లేని స్థితిలో ఉన్నవారికి రూ.15 వేలు  అందించనున్నారు. రూ.5 వేలు పింఛను తీసుకుంటున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇకపై రూ.10 వేలు చొప్పున పింఛను ఇవ్వనున్నారు. 

రూ.106 కోట్ల అదనపు లబ్ధి

జూన్‌ నెల్లో పింఛనుదారులకు రూ.82 కోట్ల మేర సొమ్ములు అందజేయగా.. ఈనెల ఏకంగా రూ.188.40 కోట్లు పంపిణీ చేయనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని