logo

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

జిల్లాలో ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని, నమోదైన కేసును వెంటనే పరిష్కరించాలని ఎస్పీ సుసారపు శ్రీధర్‌ ఆదేశించారు.

Published : 01 Jul 2024 04:15 IST

అమలాపురం పట్టణం: జిల్లాలో ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని, నమోదైన కేసును వెంటనే పరిష్కరించాలని ఎస్పీ సుసారపు శ్రీధర్‌ ఆదేశించారు. అమలాపురంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శ్రీధర్‌ పోలీసు అధికారులకు దృశ్యమాధ్యమం ద్వారా జిల్లా నేర సమీక్ష సమావేశం ఆదివారం నిర్వహించారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు, సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలు, లోన్‌ యాప్‌లపై నమోదయ్యే కేసులను తక్షణమే పరిశీలించాలని పేర్కొన్నారు. జిల్లాలో రాత్రిళ్లు గస్తీ పెంచాలని, రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలన్నారు. ఓట్లు గల్లంతైన కేసులపై ఆరా తీశారు. అనంతరం రామచంద్రపురం ప్రభుత్వ న్యాయవాది ఎంవీఎస్‌ ప్రకాశరావుతో జులై నుంచి అమల్లోకి వస్తున్న భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అదినీయం చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ షేక్‌ ఖాదర్‌బాషా, అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని