logo

విచారణ దశలో కేసులపై దృష్టి సారించాలి: ఎస్పీ

పెండింగ్, విచారణ దశలో కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్‌ ఆదేశించారు.

Published : 29 Jun 2024 05:07 IST

మాట్లాడుతున్న ఎస్పీ జగదీష్‌

దానవాయిపేట : పెండింగ్, విచారణ దశలో కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్‌ ఆదేశించారు. జిల్లా పోలీసు యంత్రాంగంతో నెలవారీ నేర సమీక్షను నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్‌ హాలులో శుక్రవారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ రౌడీ షీటర్లు, పాత నేరస్థులపై నిఘా ఉంచడంతోపాటు పెట్రోలింగ్‌ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్‌ క్రైం, యాంటీ డ్రగ్స్, మహిళలపై జరిగే నేరాల కట్టడికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాలు, నాటుసారా, గంజాయి కేసుల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు.సార్వత్రిక ఎన్నికల్లో అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన పలువురు అధికారులను ఎస్పీ అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులను అందజేశారు. సమావేశంలో ఏఎస్పీలు పి.అనిల్‌కుమార్, టి.సర్కార్, డీఎస్పీ డి.ప్రభాకర్, జిల్లాలోని వివిధ జోనల్‌ డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని