logo

అప్రమత్తమై.. అతివను రక్షించారు..

భర్తతో విభేదాల కారణంగా నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళను పోలీసులు, మత్స్యకారులు అప్రమత్తమై రక్షించిన ఘటన రాజమహేంద్రవరం రోడ్డు-రైలు వంతెనపై శుక్రవారం చోటుచేసుకుంది.

Published : 29 Jun 2024 04:46 IST

దానవాయిపేట, న్యూస్‌టుడే: భర్తతో విభేదాల కారణంగా నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళను పోలీసులు, మత్స్యకారులు అప్రమత్తమై రక్షించిన ఘటన రాజమహేంద్రవరం రోడ్డు-రైలు వంతెనపై శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు వివరాల మేరకు.. రాజమహేంద్రవరానికి చెందిన వివాహిత(40)కు భర్తతో కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ దంపతులకు బాబు(12), పాప(10) సంతానం. శుక్రవారం మధ్యాహ్నం దంపతుల మధ్య వివాదం తారస్థాయికి చేరడంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. నాలుగున్నర గంటల సమయంలో రోడ్డు-రైలు వంతెన పైనుంచి గోదావరిలోకి దూకేసింది. ఘటన చూసి చోదకులు వెంటనే 100 నంబరుకు సమాచారం ఇచ్చారు. రెండో పట్టణ పోలీసులు వెంటనే వంతెనపైకి చేరుకుని దోభీ ఘాట్‌ వద్ద జాలర్లను అప్రమత్తం చేశారు. మహిళకు ఈత రావడం... నదిపై తేలి ఆడడంతో నిమిషాల వ్యవధిలో జాలర్లు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించగలిగారు. పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి ఆమెను విచారించారు. భర్తతో పాటు కుటుంబీకులను పిలిపించి సీఐ వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. ఈ సందర్భంగా జాలర్లు, పోలీసులను పలువురు అభినందించారు.

నదిలో మునిగిపోతున్న మహిళను కాపాడుతున్న మత్స్యకారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని