logo

మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. ఆరుద్ర కుమార్తె వైద్యానికి సాయం అందజేత

కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలేనికి చెందిన వైకాపా బాధితురాలు ఆరుద్రకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారు. మంచం పట్టిన ఆమె కుమార్తె సాయిలక్ష్మీచంద్రకు అవసరమైన చికిత్స అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.

Updated : 27 Jun 2024 10:36 IST

ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు

ఆరుద్రకు చెక్కు అందిస్తున్న అధికారి, చిత్రంలో సాయిలక్ష్మి

ఈనాడు, కాకినాడ: కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలేనికి చెందిన వైకాపా బాధితురాలు ఆరుద్రకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారు. మంచం పట్టిన ఆమె కుమార్తె సాయిలక్ష్మీచంద్రకు అవసరమైన చికిత్స అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. రాష్ట్ర సచివాలయంలోని నాలుగో బ్లాకులో అధికారులు బుధవారం తనకు చెక్కు రూపంలో ఈ సాయం అందించారని ఆరుద్ర వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ ‘‘జగన్‌ ప్రభుత్వంలో ఇస్తాం ఇస్తామన్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ నెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినప్పుడు ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం రూ.5 లక్షల చెక్కు ఇచ్చారు. నా బిడ్డకు తొలిసారిగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ మమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతలు. మీ అందరి దీవెనల వల్లే నా కుమార్తె ఈ రోజు ప్రాణాలతో ఉంది.’’ అని అన్నారు. అన్నవరం, అమలాపురం, కాకినాడలలో తమను ఇబ్బందిపెట్టినవారిపై కేసులు నమోదుచేయాలని.. పోలీసుల మీద ప్రత్యేక కమిషన్‌ వేసి తన బిడ్డకు న్యాయం చేయాలని ఆరుద్ర కోరారు. కోర్టు కేసులు కొట్టించి తమ ఆస్తి తమకు ఇప్పించాలని.. ఈ పరిస్థితి తీసుకొచ్చిన వారిపై, తాము అప్పులపాలవడానికి కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్తి చేతికి అందక, కుమార్తె వైద్యానికి ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని