logo

East Godavari: ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

మండలంలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

Updated : 05 Jun 2024 19:44 IST

తాళ్లపూడి: మండలంలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రహదారి పక్కన చెట్లు పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. భారీ వర్షానికి పలు రహదారులు జలమయం అయ్యాయి. వేగేశ్వరపురంలో రైతు వనమాల రమణకు చెందిన పాడిపశువు(గెదే) పై పిడుగు పడి మృతి చెందింది. సుమారు రూ.లక్ష విలువ చేసే పశువు మృత్యువాత పడటంతో ఆ రైతు భోరున విలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని