logo

East godavari: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Updated : 03 Jul 2024 18:15 IST

తాళ్లపూడి: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తాళ్లపూడి మండలంలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి బుధవారం సాగునీరు విడదల చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా ఎత్తిపోతల పథకం పంపుల వద్ద ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గోదావరినదికి పసుపు కుంకుమ, పుష్పాలతో పూజలు చేసి అనంతరం స్విచ్‌ఆన్ చేసి నీరు విడుదల చేశారు. ఎత్తిపోతల పథకాలు, కొవ్వాడ కాల్వ తదితర సమస్యలను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటికి కావాల్సిన నిధులతో ప్రతిపాదనలు ఆయనకు అందజేశారు. కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రిబాలరాజు, సబ్‌కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఎస్ఈ శ్యామ్ ప్రసాద్, ఏపీ స్టేట్ అడ్వైజర్ ఎన్.వెంకటేశ్వరరావు, ఇతర ఇరిగేషన్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని