logo

ప్రైవేట్‌ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

ప్రైవేట్‌ పాఠశాలలు, కాలేజీల్లో భారీగా పెంచిన ఫీజులు నియంత్రించాలని సీపీఎం నాయకుడు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు.

Published : 29 Jun 2024 13:28 IST

నిడదవోలు: ప్రైవేట్‌ పాఠశాలలు, కాలేజీల్లో భారీగా పెంచిన ఫీజులు నియంత్రించాలని సీపీఎం నాయకుడు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిడదవోలు ఎంఈఓ గణేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ తమ పిల్లలను తల్లిదండ్రులు ప్రైవేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారని ఈ బలహీనతలను యాజమాన్యం ఆసరా చేసుకొని ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారని స్టేషనరీ వాళ్లే అమ్ముతున్నారని రాంబాబు ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్కూల్స్, కాలేజీలు విజిట్ చేస్తానని నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా వసూళ్లు చేసినా లేదా ఎవరైనా తల్లీదండ్రులు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకుంటానని ఎంఈవో చెప్పారు. ఈ కార్యక్రమంలో గోపి, నానీ, చరణ్, దుర్గాప్రసాద్‌లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని