logo

వసతిగృహ సమస్యలు పరిష్కరించాలి

ఎస్వీయూలోని వసతిగృహాల్లో తమకు వడ్డించే భోజనాల్లో నాణ్యత లేదని, వసతిగృహంలో సౌకర్యాలు సరిగా లేవంటూ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం వద్ద విద్యార్థినులు గురువారం ధర్నా నిర్వహించారు.

Published : 05 Jul 2024 03:02 IST

ఎస్వీయూలో విద్యార్థినుల ధర్నా 

ఎస్వీయూ పరిపాలనా భవనం వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థినులు 

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: ఎస్వీయూలోని వసతిగృహాల్లో తమకు వడ్డించే భోజనాల్లో నాణ్యత లేదని, వసతిగృహంలో సౌకర్యాలు సరిగా లేవంటూ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం వద్ద విద్యార్థినులు గురువారం ధర్నా నిర్వహించారు. ముందురోజు రాత్రి విశ్వవిద్యాలయ ఆవరణలోని వసతిగృహం రోడ్డుపై విద్యార్థినులు నిరసనకు దిగిన విషయం విదితమే. పోలీసుల హామీ మేరకు నిరసన విరమించిన వారు ఉదయం పది గంటలకు పరిపాలనా భవనం ఎదుట నిరసనకు దిగారు. ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ చంద్రయ్యతో చర్చలు జరిపారు. అనంతరం సెనేట్‌ హాల్లో వసతిగృహ వార్డెన్లతో కలిపి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సమస్యలు నివేదించారు. చాలాకాలంగా భోజనాలు సరిగాలేవని, మంచి కూరగాయలతో వంటలు చేయడం లేదని, పాచిపోయిన కూరలు, పాడైపోయిన చికెన్‌ వడ్డిస్తున్నారంటూ వాపోయారు. గదులు పరిసర ప్రాంతాలు అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయని చెప్పారు. వాటిని సావధానంగా విన్న అధికారులు త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని