logo

సీఎం ఫ్లెక్సీపై పేడ కొట్టిన దుండగులు

పింఛన్‌ సాయం పెంచి, నెల మొదటి రోజే అందించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎం నారా చంద్రబాబు ఫ్లెక్సీలోని ఆయన ముఖంపై గుర్తుతెలియని వ్యక్తులు పేడ కొట్టారు.

Published : 05 Jul 2024 02:35 IST

వైకాపా వారి పనేనంటూ తెదేపా నాయకుల ఆరోపణ

కుప్పం పట్టణం (శాంతిపురం): పింఛన్‌ సాయం పెంచి, నెల మొదటి రోజే అందించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎం నారా చంద్రబాబు ఫ్లెక్సీలోని ఆయన ముఖంపై గుర్తుతెలియని వ్యక్తులు పేడ కొట్టారు. ఈ ఘటన కడపల్లె గ్రామ సచివాలయం వద్ద గురువారం వెలుగు చూసింది. పింఛన్ల పంపిణీలో భాగంగా ఈ నెల 1న సచివాలయం వద్ద ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి స్థానిక నాయకులు, లబ్ధిదారులు, అధికారులు క్షీరాభిషేకం చేశారు. తర్వాత ఫ్లెక్సీని అలాగే ఉంచారు. గురువారం ఉదయం సచివాలయ సిబ్బంది వచ్చి చూడగా ఈ విషయం వెలుగు చూసింది.. ఇవన్నీ వైకాపా ఆగడాలేనని తెదేపా నాయకులు నిరసన తెలిపారు. మంచి పేరును తట్టుకోలేక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని వైకాపా మండల కన్వీనర్‌ దండపాణి, అనుచరులపై అనుమానం ఉన్నట్లు రాళ్లబూదుగూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు. పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని