logo

డీకేటీ ముసుగులో గుట్టక్కు

మండలంలోని సామిరెడ్డిపల్లె రెవెన్యూ పరిధిలోని గుట్టను ఓ వ్యక్తి యంత్రాల సాయంతో ఆక్రమించేందుకు యత్నించాడు.

Published : 05 Jul 2024 02:02 IST

ఆక్రమణ అడ్డుకున్న అయ్యప్ప సేవా సంఘం సభ్యులు

మోపిరెడ్డిపల్లె బస్టాపు వద్ద గుట్టను చదును చేసిన దృశ్యం 

పెనుమూరు, న్యూస్‌టుడే: మండలంలోని సామిరెడ్డిపల్లె రెవెన్యూ పరిధిలోని గుట్టను ఓ వ్యక్తి యంత్రాల సాయంతో ఆక్రమించేందుకు యత్నించాడు. అతడికి గుట్ట దిగువన కొంత భూమికి డీకేటీ పట్టా ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని గుట్టను ఆక్రమించి చదును చేసేందుకు ఉపక్రమించాడు. ఈ తంతు పెనుమూరు-చిత్తూరు రహదారికి పక్కనే జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. 
సామిరెడ్డిపల్లె రెవెన్యూ పరిధిలో మోపిరెడ్డిపల్లె బస్టాపు వద్ద సర్వే నంబరు 547లో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో గుట్ట ఉంది. అందులో కొంత భాగాన్ని గతంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి కేటాయించారు. పై భాగంలో ఆలయ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న డీకేటీ పట్టా ఉన్న రైతు ఇటీవల గుట్టను ఆక్రమించుకునేందుకు యత్నించాడు. తనకు పట్టా ఉన్న స్థలానికి పక్కనే గుట్టను జేసీబీ సాయంతో కొంత భాగాన్ని చదును చేశాడు. విషయం అయ్యప్ప ఆలయ కమిటీకి తెలియడంతో వెంటనే సంఘం అధ్యక్షుడు, గురుస్వామి రవీంద్రనాయుడు, సభ్యులు అక్కడకు చేరుకుని పనులు అడ్డుకున్నారు. ఈ సమయంలో రైతుకు, కమిటీ సభ్యులకు నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు రైతు సదరు పనులు నిలిపేశాడు. ఈ విషయమై తహసీల్దారు సుభద్రను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు. వీఆర్వో ద్వారా సమాచారాన్ని తెలుసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు